ప్రజాశక్తి-చీరాల : వ్యవసాయ ప్రయోగ శాలలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలో రూ.96 లక్షలతో నిర్మిస్తున్న వైఎస్‌ఆర్‌అగ్రి టెస్టింగ్ ల్యాబ్, వైఎస్‌ఆర్ పశు వైద్య నిర్ధారణ ప్రయోగశాల భవన సము దాయాన్ని జిల్లా కలెక్టర్, రంజిత్ బాషా,ఎమ్మెల్యే కరణం బలరామకష్ణ మూర్తి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అవసరమైన ప్రభుత్వ సేవలు రైతులకు అందించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవసాయ ప్రయోగశాలను త్వరగా నిర్మించాలన్నారు. అవసరమైన పరికరాలు, యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. చీరాల నియోజకవర్గ స్థాయి ప్రయోగశాలను త్వరగా ప్రారంభించడానికి అధి కారులు ఏర్పాట్లు చేయాలని పలు సూచనలు చేశారు. ప్రయోగశాలలో ఏర్పాటు చేయనున్న యంత్రాలు, పరికరాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్ని అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్ర ుంలో ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, ఆర్ బి కె చైర్మన్ కావూరి రమణా రెడ్డి, ఎఒ సుమతి, వివిధ శాఖల అధికారులు తెలిపారు.










