ప్రయివేటు ఉపాధ్యాయులకు సహకారం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రయివేటు విద్యాసంస్థలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి ఎంఎల్‌సిగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీధర్ గార్డెన్‌లో ఆత్మకూరు అపస్మా నియోజకవర్గ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఎంఎల్‌సి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల మూలంగా ప్రభుత్వానికి భారం తగ్గడమే కాకుండా టీచర్ వృత్తిని ఎంచుకున్న ఎంతో మందికి ప్రయివేట్ విద్యాసంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయివేటు విద్యాసంస్థలు రెండింటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే విద్యా ప్రమాణాల స్థాయి పెరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరుగాంచిన పలువురు ఉపాధ్యాయులను ఎంఎల్‌సి చంద్రశేఖర్‌రెడ్డి సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం అపస్మా ఎంఎల్‌సిగా చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కావలి డిప్యూటీ ఉప విద్యాశాఖ అధికారి రఘురామయ్య, ఆత్మకూరు విద్యాశాఖ అధికారి షేక్ నజీర్‌భాషా, అపస్మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈగ భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.వెంకట సుబ్బయ్య, ఆత్మకూరు కార్యదర్శి బి.రమేష్, కోశాధికారి కోటేశ్వర్ రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










