Oct 12,2023 20:48

మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, అధ్యాపకులు

కడప : విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పిం చాల్సిన అవసరమెంతైనా ఉందని ఆర్ట్స్‌ కళాశాల డాక్టర్‌ జి. రవీం ద్రనాధ్‌ అన్నారు. గురువారం కళాశాలలో ఎన్‌సిసి ఆధ్వ ర్యంలో అమృత్‌ కలశ యాత్ర నిర్వహించారు. వాలంటీర్ల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రిన్సిపల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో మాతభూమి పట్ల బాధ్యతను పెంచు తుందని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వై. సావిత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాత భూమి ఆవశ్య కతను తెలుసుకొని తమ వంతు కర్తవ్యంగా మాత దేశం రుణాన్ని తీర్చుకోఆలన్నారు. శివరామకష్ణ మాట్లాడుతూ మొక్క లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొ నాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎ. నాగరాజు , వైస్‌ ప్రిన్సి పల్‌ డాక్టర్‌ ఎం రమేష్‌, డాక్టర్‌ పి. రవి శేఖర్‌, మహేష్‌, రాజేశ్వరి, ఆదినారాయణ, సుధాకర్‌ రెడ్డి, భూషణ్‌ రెడ్డి, గిడ్డయ్య, బయపు రెడ్డి, విజరు కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.