Sep 13,2023 20:40

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న డిఎంహెచ్‌ఒ నాగరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు

కడప అర్బన్‌ : మట్టి గణపతిని ప్రతి ఒక్కరూ ప్రతిష్టించి పర్యావరణానికి హానిక రమైన ప్లాస్టిక్‌ ఆఫ్‌ ప్యారిస్‌ని వాడకుండా అందరం పర్యావరణాన్ని కాపాడు కుందామని డిఎంహెచ్‌ఒ నాగరాజు తెలిపారు. బుధవారం డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ అధ్వర్యంలో ముద్రించిన మట్టి గణపతిని ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం పోస్టర్‌ను వైద్య శాఖ అధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం అనేక రకాల రీతిలో కాలుష్యం అవుతూ రోజు రోజుకు జీవావరణానికి ప్రమాదకరస్థాయిలో ఏర్పడిందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వినాయక చవితి అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైనటువంటి ప్లాస్టిక్‌ ఆఫ్‌ ప్యారిస్‌ లాంటి వాటిని దూరంగా ఉంచి మట్టి గణపతి విగ్రహాలను ప్రతి ఒక్కరు ప్రతిష్టించి పర్యావరణం కాలుష్యం కాకుండా చూసుకోవడానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్‌ఐ యువజన సంఘం నాయకత్వానికి అభినందనలన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్‌ మాట్లాడుతూ పోరాటాలు మాత్రమే కాదని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం తీవ్ర స్థాయిలో వుందన్నారు. దేశంలో మెట్రో లాంటి నగరాలు పర్యావరణ కాలుష్యము ప్రమాద స్థాయిలో వుందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇటువంటి సందర్భంలో అందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత వుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌ రాజ్‌, రబ్బా నరసింహులు, నగర అధ్యక్షులు షాకీర్‌ పాల్గొన్నారు.