Aug 10,2023 21:28

మొక్కలు నాటుతున్న ఎంపిపి దీనమయ్య

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి బాధ్యతతో పరిరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఎంపిపి కుంబిరిక దీనమయ్య కోరారు. ఆజాదిక అమత్‌ మహౌత్సవంలో భాగంగా మండలంలోని రెల్లలో నా భూమి నా దేశం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దేశం కోసం పోరాడిన, ప్రాణాలర్పించిన, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరులు చిహ్నంగా గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిర్మించిన శిలాఫలకాన్ని ప్రారంభించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అలాగే గుమ్మల క్ష్మీపురం, ఎల్విన్‌ పేట, కేదారిపురం పంచా యతీల్లో నా భూమి నా దేశం కార్యక్రమా న్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు బొత్తాడ గౌరీ శంకర్‌ రావు, ఆర్‌ చైతన్య స్రవంతి, తులసమ్మ, వైస్‌ ఎంపిపి నిమ్మక శేఖర్‌, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి గిరి బాబు అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
గరుగుబిల్లి : ఆజాదికా అమత్‌ మహౌత్సవ్‌ కార్యక్రమంలో భాగంగానానేల, నా దేశం, నేలతల్లికి నమస్కారం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. రావుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ బొంతాడ మహేశ్వ రరావు అన్నారు. కార్యక్రమంలో ఎపిఒ ఎం.గౌరీనాథ్‌, సాంకేతిక సహాయకులు కొట్నాన నిర్మల, మర్రాపు భూలక్ష్మి, పద్మ, ఉమ, క్షేత్రసహాయకులు తదితరులు పాల్గొన్నారు.