ప్రజాశక్తి -మధురవాడ : మానవ జీవితం ప్రశాంతంగా, ఉన్నతంగా, సుస్థిరంగా కొనసాగాలంటే పర్యావరణాన్ని ముఖ్యంగా ప్రకతిని గౌరవించడం నేర్చుకోవాలని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థల డిప్యూటీ చీఫ్ బ్రహ్మకుమారి జయంతి అన్నారు. మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రకతితో సహజీవనం చేయాలే తప్ప, అవసరమున్నా, లేకున్నా ప్రకృతిని నాశనం చేస్తే మానవ మనుగడ, శాంతికి ముప్పు తప్పదన్నారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా శాంతియుత జీవనం సాధ్యపడుతుందన్నారు. సహజ వనరులను సంరక్షించుకోవడం మానవ మనుగడకు అవసరమన్నారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎమ్. శ్రీభరత్, గీతం ప్రోవైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతం జిమ్సర్ ఆసుపత్రి ఆవరణలో బ్రహ్మకుమారి జయంతి, గీతం అధ్యక్షుడు ఎమ్. శ్రీభరత్ మొక్కలు నాటారు.










