Jul 28,2023 17:14

ప్రజాశక్తి - భీమడోలు
        పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వృక్షాలను, జంతువులను కాపాడవలసిన ఆవశ్యకత ఉందని భీమడోలు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్‌ డి.సోహిని తెలిపారు. ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన, పోస్టర్‌ మేకింగ్‌ పోటీలను పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించామన్నారు. అనంతరం పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.