May 12,2023 23:30

ర్యాలీ చేపడుతున్న అటవీశాఖ సిబ్బంది

ప్రజాశక్తి-గొలుగొండ:పర్యావరణాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని కేడిపేట అటవీ శాఖ రేంజ్‌ అధికారి సుంకర వెంకటరావు సూచించారు. కృష్ణదేవిపేట సమీపంలో నల్లగొండ గ్రామంలో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై అటవీ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ముఖ్య అతిధిగా హాజరైన చింతపల్లి ఎఎంసి చైర్మన్‌ జైతి రాజులమ్మ మాట్లాడుతూ, అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వీఆర్వో రాజేష్‌, సెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌, గార్డు ఎరుకులమ్మ పాల్గొన్నారు.