Sep 16,2023 19:45

ప్రతిభలో పర్యావరణహిత మట్టి విగ్రహాల పోటీ
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన పొందాలని ప్రతిభ పాఠశాల ప్రిన్సిపల్‌ సరోజ రెడ్డి తెలిపారు. శనివారం విద్యార్థుల్లో పర్యావరణం గురించి అవగాహన కలిగించడానికి ప్రతిభ పాఠశాల ప్రాంగణంలో పర్యావరణహిత గణేష్‌ మట్టి విగ్రహాల పోటీ నిర్వహించారు. 300 మందికి పైగా విద్యార్థులు వివిధ పదార్థాలతో ప్రతిమలను తయారు చేసి మట్టి విగ్రహాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అందజేశారని ఆమె తెలిపారు. వినాయక చవితి నేపథ్యంలో రసాయనాలతో కూడిన విగ్రహాలు తయారు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న ప్రజల్లో మార్పు రావడం లేదన్నారు. కాలుష్య రహిత మట్టి విగ్రహాలని వినాయకచవితి ఉత్సవాలకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ పాఠశాల అకడమిక్‌ డైరెక్టర్‌ సింధూషా రెడ్డి, సుభాష్‌ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.