May 15,2023 00:38

ప్రజాశక్తి - పెద్దాపురం, ఏలేశ్వరం స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో 7 వ రోజు వాడపల్లి విమలారాణి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం ఆర్‌.వెంకటేశ్వరరావు గణితంలో మెలకువలు వివరించారు. జి.వెంకటరావు స్పోకెన్‌ ఇంగ్లీష్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కథలు చదివించడం, కథలు చెప్పడం, పుస్తక సమీక్ష, పుస్తక పఠనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పాలంకి నాగరాజు, సింగం బుల్లయ్య, మరియమ్మ, పాఠకులు పాల్గొన్నారు.
చిత్రలేఖనం ద్వారా సజనాత్మకత
చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న సజనాత్మకతను బయటకు తీయచ్చని ప్రముఖ చిత్రకారుడు మామిడి రాము అన్నారు. స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఆయన విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలను వివరించారు. అనంతరం ప్రకతి వ్యవసాయం పెరటి మొక్కలు వాటి ఉపయోగాలను మాస్టర్‌ ట్రైనర్‌ మజ్జి నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్‌ రవికొండల సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు.