Aug 22,2023 17:25

ప్రజాశక్తి - చింతలపూడి
    పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు తెలిపారు. మంచి మనసుతో ఎకో భారత్‌ అనే ప్రాజెక్ట్‌ ద్వారా పర్యావరణానికి హాని కలిగించని వస్తువులు తయారు చేస్తూ ప్రకృతిని పరీక్షించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చింతలపూడి పట్టణంలో మంగళవారం ఈ ఎకో భారత్‌ ప్రాజెక్టులో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్‌ లిమిటెడ్‌తో కలిసి బయోడీగ్రేడబుల్‌ బ్యాగ్స్‌ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం చేయాల్సిన కృషి గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎకో భారత్‌ సోషల్‌ ఇనిషియేటివ్‌లో భాగం అవుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్‌ లిమిటెడ్‌ పార్ట్‌నర్స్‌ పి.వంశీ, ఎస్‌.రవి మాట్లాడుతూ పర్యావరణం, సమాజానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో తమ ఎకో భారత్‌ బయోడీగ్రేడబుల్‌ బ్యాగ్స్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలియజేశారు.