విద్యార్థులకు మొక్కలు అందజేస్తున్న సభ్యులు
ప్రజాశక్తి - లింగసముద్రం : మండలంలోని ఆర్.ఆర్ పాలెం గ్రామానికి చెందిన చండ్ర తిరుపతయ్య, అబ్బయ్యనాయుడు స్థాపించిన అభయశ్రీ ఫౌండేషన్ ద్వారా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నుంచి ప్రారంభించారు. పాఠశాలోని ప్రతి విద్యార్థికి ఒక్క మొక్కను అందజేశారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. మొక్కలు మానవ పురోగతికి ఎంతో ఉపయోగపడుతుందని ఆర్.ఆర్ పాలెం సర్పంచ్ చింతగుంపల అంజమ్మ చెప్పారు.అభయశ్రీ పౌండేషన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని పాఠశాల ప్రధానోపాద్యాయులు పూరిమిట్ల మాధవరావు అన్నారు. పిఎంసి చైర్మన్ రమీజా,పౌండేషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసులనాయుడు,గ్రామస్తులు,ఉపాద్యాయలు ఉన్నారు.










