Aug 12,2023 20:51

మెళియాపుట్టి.. మొక్క నాటుతున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

ప్రజాశక్తి-మెళియాపుట్టి : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మండలంలోని పట్టుపురం గ్రామంలో నా భూమి -నా దేశం కార్యక్రమంలో భాగంగా నూతన సచివాలయ ఆవరణలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. దేశ రక్షణకు ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.సరోజినీ, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎపిఎం లలిత, సర్పంచ్‌ సంపతిరావు లక్ష్మి పాల్గొన్నారు.
ఆమదాలవలస : పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణలో నా భూమి - నా దేశం కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధికారులు చేపట్టారు. నా భూమి- నా దేశం కార్యక్రమంలో భాగంగా అమరవీరుల శిలాఫలకాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అమ్మనమ్మ, టి.మల్లేశ్వరరావును స్పీకర్‌ సత్కరించారు. అమరవీరుడు తోలాపి గోవిందరావు తండ్రి మల్లేశ్వరరావు మాట్లాడుతూ సొట్టవానిపేట ఇందిరమ్మ కాలనీకి తన కుమారుడి పేరు పెట్టారని ప్రభుత్వం తరఫున బోర్డు ఏర్పాటుచేయాలని కమిషనర్‌ రవి సుధాకర్‌కు వినతి అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌, ఎ.ఉమా మహేశ్వరరావు, ఎఇ సృజన, మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : డోకులపాడు పంచాయతీలో భరతమాత, గాంధీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు సర్పంచ్‌ వడ్డి సరిత పూలమాల వేసి నివాళులర్పించారు. శిలాఫలకాలన్ని ఆవిష్కరించారు. అమరవీరుల సంస్మరణార్థం మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైసిపి క్లస్టర్‌ ఇన్‌ఛార్జి వడ్డి కరుణాకర్‌, ఎపిఒ కేశవ, ఎంపిటిసి భాగ్యలక్ష్మి డిల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి యాదవ రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జి.సిగడాం : ఎస్‌పిఆర్‌పురంలో సర్పంచ్‌ కంది రమాదేవి ఆధ్వర్యాన నా మట్టి- నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కూనిబిల్లి కోటేశ్వరావు, ఇసి గేదెల పురుషోత్తం, కంది సాయి, ఎపిఎం రెడ్డి రామకృష్ణం నాయుడు పాల్గొన్నారు.
పలాస : మండలంలోని మాకన్నపల్లిలో స్వాతంత్ర సమరయోధులకు ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సైని దేసయ్య, ఇఒపిఆర్‌డి మెట్ట వైకుంఠరావు, కోరాడ ధనరాజ్‌, రాపాక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
లావేరు : మండలంలోని పెదలింగాలవలసలో నాభూమి-నాదేశం కార్యక్రమాన్ని సర్పంచ్‌ లుకలాపు యశోద నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని వైసిపి సీనియర్‌ నాయకులు లుకలాపు అప్పలనాయుడు ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి లుకలాపు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి మడ్డి రమణ, మాజీ ఎంపిటిసి లంక రాంబాబు, ఫీల్డ్‌అసిస్టెంట్‌ బి.సత్యం, సిబ్బంది సిహెచ్‌ రవి పాల్గొన్నారు .
రణస్థలం : మండలంలో నా భూమి- నా దేశం కార్యక్రమంలో భాగంగా వల్లభరావుపేటలో మహిళా అధ్యక్షులు మానస చిరంజీవి, తిరుపతిపాలెంలో సర్పంచ్‌ ఆకుల రవి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు మహంతి సత్యనారాయణ, గడి బలరాం, ఎపిఒ శ్రీనివాసనాయుడు, జెఇ గౌరీశంకర్‌, ఆకుల గోపి, మండల రవి, వాళ్లే హరిబాబు, మండల అసిరినాయుడు, కార్యదర్శి గోవిందరావు పాల్గొన్నారు.
పోలాకి : సంతలక్ష్మీపురంలో నాభూమి- నాదేశం కార్యక్రమాన్ని సర్పంచ్‌ యారబాటి నీలవేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వై.వెంకటరమణ పాల్గొన్నారు.
నందిగాం : మండలంలో నందిగాంంలో నాయకులు జడ్యాడ జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన 'నా భూమి - నా దేశం కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు పాల్గొన్నారు. జాతీయ నాయకులను, అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శివప్రసాద్‌,. ఎంపిటిసి అంబోడి విష్ణు, నాయకులు చిన్ని జోగారావు యాదవ్‌, ఎపిఒ నాగరాజు పాల్గొన్నారు.
కవిటి : కవిటి గ్రామంలో నా భూమి- నా దేశం కార్యక్రమాన్ని సర్పంచ్‌ పూడి లక్ష్మణరావు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఇఒ వీరభద్ర స్వామి, నాయకులు పూడి నీలాచలం, పాండవ శేఖర్‌, బెందాళం రమణమూర్తి, డి.దుర్యోధన, డి.ధర్మారావు, విఆర్‌ఒ నారాయణ పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్‌ కోరారు. మండలంలో కొఠారి పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో వివేకానంద రెడ్డి, ఉప్పాడ రాజారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
టెక్కలి : నా భూమి - నా దేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దరోకళ్లపల్లిలో ఎంపిడిఒ హనుమంతు వెంకటరమణ మూర్తి మొక్కలు నాటారు. బొప్పాయిపురం, అయోధ్యపురం, నర్సింగపల్లి, అక్కవరం పంచాయతీల్లో మెక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు రాంపాత్రుని అనూష, గుజ్జు మోహన్‌రెడ్డి, బగాది హరి, రౌతు జయమోహన్‌, పొట్నూరు భూలక్ష్మి ఆప్పలనాయుడు, మక్క రాజేశ్వరరెడ్డి, పాల రవికుమార్‌ రెడ్డి, వర్దన్‌, వైకుంఠరావు పాల్గొన్నారు.