May 20,2023 22:52

ఈహెహికల్‌ను ట్రైల్‌లో కలెక్టర్‌ కృతికా, జెసి ఇలాక్కియా


- నెడ్‌ క్యాప్‌ ఉద్యోగులకు సులభ వాయిదాలపై వాహనాలు
- వినియోగంపై అవగాహన స్టాల్స్‌, ప్రదర్శనలు ఏర్పాటు
ప్రజాశక్తి - కాకినాడ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ పట్టణ ప్రజలు ఎక్కువమంది ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగించడం వల్ల కాలుష్య రహిత నగరంగా కాకినాడను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పిలుపు నిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ ఆవరణలలో ఎపి-నెడ్‌ క్యాప్‌ ఆధ్వ ర్యంలో గో ఎలక్ట్రిక్‌ - గో గ్రీన్‌ నినాదాంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనను కలెక్టర్‌ కృతిక, జెసి ఎస్‌.ఇలాక్కియా, జిల్లా నెడ్‌ క్యాప్‌ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్‌తో వాహనాల చార్జింగ్‌ విధానం, ధర, వాహనాల వినియోగంపై ప్రదర్శన స్టాల్స్‌లో ఏర్పాటుచేసిన టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌, సైకిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను కలెక్టరు పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మిషన్‌ లైఫ్‌ కార్యక్రమంలో భాగంగా పర్యా వరణాన్ని పరిరక్షించేందుకు కాకినాడ పట్టణ ప్రజలు ఎక్కువమంది ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగించడం ద్వారా కాలుష్య రహిత నగరంగా కాకినాడను తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సులభ వాయిదాల పద్ధతిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపారు. అంతర్జా తీయ పర్యావరణ దినోత్స వాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి జూన్‌ నెల 05 వరకు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. జిల్లాలో అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ పర్యావరణం, విద్యుత్‌, నీరు, బీచ్‌ క్లీనింగ్‌ వంటి అంశాలపై ప్రతిరోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టరు కృతికా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ డిఆర్‌ఒ కె.శ్రీరమణి, జిల్లా నెడ్‌ క్యాప్‌ డీఎం.జి.సత్యనారాయణ, ఇఇ పీ. పాండురంగారావు, డెవలప్మెంట్‌ అధికారులు ఉదరు, శివ పాల్గొన్నారు.