ప్రజాశక్తి - కర్లపాలెం
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కర్లపాలెం తహశీల్దార్ కేశవ నారాయణ అన్నారు. బుధవారం కర్లపాలెం మండలం స్టానిక మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యములో బాపట్ల జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ రంజిత్‌భాష ఆశయంలో భాగముగా పి.డి.డి ఆర్.డి.ఎ బి.అర్జున్‌రావు ఆదేశాలమేరకకు మహిళా సంఘాలకకు గ్రీన్ బాపట్ల కార్యక్రమములో 2 లక్షల మొక్కల నాటటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తలపెట్టిన గ్రీన్ బాపట్ల కార్యక్రమం గొప్ప హరిత బాపట్లకు దారి తీస్తుందని, ప్రతి గ్రామంలో మొక్కలు నాటి హరిత బాపట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ప్రకతిని, పర్యావరణ పరిరక్షణను భాద్యతగా తీసుకొని స్వచ్చ ఆంధ్రాలో స్వచ్చ బాపట్లగా గుర్తింపు తేవాలనే కలక్టర్ ఆశయంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మహిళా సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం బాపట్ల డి.పి.ఓ దాసరి రాంబాబు మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బాపట్లను గ్రీన్ బాపట్లగ తీర్చిదిద్దాలని హరిత బాపట్లగా రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 28న 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టినట్లు, ఇది గొప్ప శుభ సూచకమని వివరించారు. అనంతరం కర్లపాలెం సచివాలయం సిబ్బంది, యం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్, ఐ.సి.డి.ఎస్ శాఖల సమన్వయంతో గ్రీన్ బాపట్లపై అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎం శ్రీనివాసులురెడ్డి, కర్లపాలెం కార్యదర్శి మోడి శ్రీనివాసరావు, యం.జి.ఎన్‌ఆర్.ఈ.జి.ఎస్ ఎ.పి.ఓ సుందరరావు, సి.సిలు ఎస్.పూరఃచంద్రరావు, కే.సశివకోటేస్వరరావు, లక్ష్మిసోమేశ్వరి, అకౌంటెంట్ లక్ష్మి, ఐ.సి.డిఎస్ సూపర్‌వైజర్ మల్లేశ్వరి, విఒఎలు మార్తమ్మ, మంజుల, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
వేటపాలెం : వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేట గ్రామ పంచాయతీలో బుధవారం బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం గ్రీన్ బాపట్ల (2 లక్షలు మొక్కలు నాటే కారఁక్రమం) ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈఒఆర్‌డి సజ్జా శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి యం.శ్రీనివాసరావు, ఎపిఒ వి.సుధారాణి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.










