ప్రజశక్తి - చీరాల
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని స్టేట్ బ్యాంక్ ముఖ్య కార్యా నిర్వహణాధికారి రామానాయుడు అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, పెట్రోలు వాహనాలు అధికంగా వాడటం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడితోపాటు సంస్థ అధ్యక్షులు నాగ వీరబద్రాచారి తదితర వక్తలు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు. మొక్కలు విరివిరిగా పెంచాలన్నారు. అనంతరం గుడ్డ సంచులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సహజ కవి వడలి రాధాకృష్ణ, ఏకాంబరేశ్వరరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, గాదె హరిహరరావు, యలమందారెడ్డి, శివకుమార్, ఎంవీ రామారావు పాల్గొన్నారు.










