ప్రజాశక్తి- కవిటి : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజంలోని ప్రతి వ్యక్తి ప్రకృతితో మమేకమవ్వాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. నా భూమి-నా దేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని కుసుంపురం, దుగానపుట్టుగ గ్రామాల్లో ఆదివారం మొక్కలు నాటి మట్టిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఎందరో త్యాగధనుల నిస్వార్థ కృషి నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి త్యాగాలు మరువకుండా వాటిని స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్, వైస్ ఎంపిపి కర్రి గోపయ్య, దుగానపుట్టుగ, కుసుంపురం, బెజ్జిపుట్టుగ సర్పంచ్‌లు డి.భద్రాచలం, ఊర్మిళ బిసాయి, నారాయణ స్వామి, నాయకులు శివ బిసాయి, కర్రి సత్యం, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, ఎంఇఒ ధనుంజయ మజ్జి, ఎపిఎం గోవిందరావు పాల్గొన్నారు.
అమరుల సేవలు మరువలేనివి
టెక్కలి : దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆసువుల బాసిన అమర వీరుల సేవలు మరువలేనివని ప్రజాచైతన్య కళాసమితి టెక్కలిశాఖ వ్యవస్థాపకులు చిలుకు కృష్ణారావు అన్నారు. మేరా మీట్ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో 75 అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగించారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని విశ్రాంత ప్రిన్సిపాల్ రెయ్యి పున్నయ్య జెండా ఊపి ప్రారంబించారు. మెయిన్‌రోడ్డు, చేరీవీధి, ప్రజా చైతన్య కళా సమితి భవనం వరకు ర్యాలీ సాగింది. అనంతరం విద్యార్థులకు వ్యాస, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహమతులు అందజేవారు. కార్యక్రమంలో మెళియాపుట్టి, నందిగాం ఎంఇఒలు మల్లారెడ్డి పద్మనాభం, అన్నుపురం చిన్నారావు, గణపతి, తూట భాస్కరరావు, ఆర్.వి.రమణమూర్తి, దేవాది సునీత, గున్న ప్రసాదరావు, ఢిల్లేశ్వరరావు, మార్కండేయులు, సూర్యారావు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : అమరవీరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు అన్నారు. మండలంలోని నగరంపల్లి పంచాయతీ ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సర్పంచ్ దువ్వాడ పద్మావతి అధ్యక్షతన మేరీ మిట్టి-మేరీ దేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిటిసి ప్రతినిధి బమ్మిడి మోహనరావు, ఉప సర్పంచ్ ప్రతినిధి యదల్ల పాపారావు, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, మావిడి గోపి, నీలచలం, గౌతమ్, వార్డు మెంబర్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
టెక్కలి రూరల్ : పర్యావరణం పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ప్రతిఒక్కరూ ప్రకృతితో మమేకమవ్వా లని ఎంపిడిఒ సిహెచ్.వి.రమణమూర్తి అన్నారు. ఆజాద్‌కా అమృత్ మహోత్సవంలో భాగంగా తలగాంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పేడాడ రమేష్, సర్పంచ్ హనుమంతు వెంకటేశ్వరరావు, ఎపిఒ బగాది ప్రసాదరావు, డ్వాక్రా గ్రూపు సిసి పద్మ పాల్గొన్నారు.










