Sep 27,2023 23:44

పర్యావరణ హిత టూరిజం అభివద్ధి చెందాలి: మేయర్‌


పర్యావరణ హిత టూరిజం అభివద్ధి చెందాలి: మేయర్‌
ప్రజాశక్తి- తిరుచానూరు: పర్యాటక రంగ అభివద్ధి ద్వారా ఆర్థికంగా అభివద్ధి అవు తుందని, తిరుపతి లాంటి నగరంలో పర్యాటక రంగం, ఆతిథ్య రంగానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, పర్యావరణహితంగా పర్యాటక రంగాన్ని అభివద్ధి పథంలో తీసుకెళ్లాలని జెసి డికే బాలాజీ, నగరపాలక సంస్థ మేయర్‌ శిరీష, ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి సంయుక్తంగా అన్నారు. బుధవారం ఉదయం స్థానిక రామానుజ సర్కిల్‌లో ప్రపంచ పర్యాటక దినం 2023 పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2 కె రన్‌ లో మేయర్‌, జెసి, ఎస్పీ సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌ మాట్లాడుతూ టూరిజం పైన ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని హోటల్స్‌, పబ్లిక్‌ ట్రాన్సుపోర్ట్‌, ట్రావెల్‌ ఏజెన్సీలు వంటి వారు టూరిజం పైన ఆధారపడి వారు ఆర్ధికంగా అభివద్ధి చెందుతున్నారని, పర్యాటక ప్రాంతాలు కూడా అభివద్ది చెందుతున్నాయని అందులో తిరుపతి కూడా పర్యాటకం గా ఎంతో అభివద్ధి చెందుతోందన్నారు. ఈ సంవత్సరం పర్యాటక దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం టూరిజం అండ్‌ గ్రీన్‌ ఇన్వెస్ట్మెంట్‌ అని, దీని ద్వారా సుస్థిర అభివద్ధి లక్ష్యాలు సాధన కోసం పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజం ను అభివద్ధి పరచడమే అన్నారు. జెసి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నేడు టూరిజం శాఖ ఆద్వర్యంలో నగరంలో 2 కే రన్‌ నిర్వహించామని టూరిజం ఒక పెద్ద వ్యవస్థ అని దీనిపై ఆధార పడి ఎన్నో ఆర్ధిక వ్యవస్థలు ఉన్నాయని మనం టూరిజం ను అభివద్ధి చేస్తే ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. తిరుపతి నగరం మంచి పర్యాటక నగరమని, ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టులకు స్నేహ భావంతో సహకారం అందించి వారిని మళ్లీ మన ప్రాంతానికి వచ్చే విధంగా మనం ఆతిథ్యం ఇవ్వాలని, టూరిస్టులకు మోడల్‌ సిటీగా కనిపించేలా ఉండాలని దీనికి ప్రజలందరి సహకారం ఉండాలన్నారు. టూరిజం అభివద్దిపై అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేసిన ఏజెన్సీ వారికి కతజ్ఞతలు తెలిపారు. ఎస్‌.పి మాట్లాడుతూ తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందున లక్షలాది ప్రజలు దైవ దర్శనం కోసం తిరుపతికి వస్తుంటారని తిరుపతి నగరంతో పాటుగా, చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా వివిధ కాన్సెప్ట్స్‌ తో పర్యాటక ప్రదేశాలు అభివద్ధి పరిచితే టూరిజం మరింత అభివద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేసి ర్యాలీలో శిల్పారామం వరకు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పర్యాటక శాఖ వారు మాధురి రెమిడీ హాస్పిటల్‌ వారిచే మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యటకశాఖ ఆర్‌డి రమణ ప్రసాద్‌ జిల్లా పర్యాటక, సాంస్కతిక శాఖ అధికారి రూపేంద్రనాథ్‌, శిల్పారామం ఏఒ ఖాదర్‌ వలీ, అస్వీ ఇన్ఫ్రా గోల్డెన్‌ లక్సరీ విల్లాస్‌ ఏజెన్సీ ప్రతినిధులు, డాక్టర్లు రాజేష్‌ రెడ్డి, సోనా తేజస్వి పాల్గొన్నారు.