Jul 06,2023 20:48

పర్యావరణ చట్టాలు పటిష్టంగా అమలు : 'గడికోట'

 రాయచోటి టౌన్‌ : పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడే సమాజానికి మంచి జరుగుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అఖిల భారత ఫారెస్ట్‌ సర్వీసు పరీక్షల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 31వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నారా భువనేశ్వర్‌ను స్థానిక వైసిపి కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్‌ అధికారిగా సేవలు అందించే అవకాశం రావడం అదష్టంగా భావించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకొని రాష్ట్రానికి సేవలందించాలని అభిలశించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లర్సు రాష్ట్ర డైరెక్టర్‌ పోలు సుబ్బారెడ్డి, నారా భువనేశ్వర్‌ దంపతులు, ప్రముఖ డాక్టర్‌ రేవూరి ధరణి కుమార్‌ దంపతులు, మాజీ బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్లూరు రెడ్డివరప్రసాద్‌ పాల్గొన్నారు.
ర్యాంకర్‌ను అభినందించిన సుగవాసి
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు పరీక్షల్లో ఆల్‌ ఇండియా స్థాయి లో 31 వ ర్యాంకు, రాష్ట్ర స్థాయి లో 2 ర్యాంకు సాధించిన నారా భువనేశ్వర్‌ టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు సుగవాసి ప్రసాద్‌ బాబు అభినందించారు. గురువారం టిడిపి కార్యాలయంలో శాలువ కప్పి శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని ఇచ్చి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్‌ అధికారిగా పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడే నిజమైన సంతప్తి కలుగుతుందన్నారు. సొంత రాష్ట్రానికి సేవ అందించే అవకాశం రావడం అదష్టమన్నారు.
- భువనేశ్వర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి