ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు సమీపంలోని కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో ఉన్న బటర్ ఫ్లై పార్కును అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులతో కలిసి పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్న మూలపాడు బటర్‌ప్లై పార్కును పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ సహజత్వానికి ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా అవసరమైన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నా మన్నారు. దాదాపు 30 వేల ఎకరాలు విస్తీరణం గల రిజర్వు ఫారెస్టులో జింకలు కుందేళ్ళు నెమ్మళ్ళు దుప్పీ అడవిపందులు కోతుల లాంటి వన్య ప్రాణులతో పాటు నక్కలు తోడేళ్ళు వంటివి సంచరి స్తా యని అటవీశాఖ అధికారులు తెలియజేశారని తెలిపారు. ఈ పర్యటనలో ఫారెస్ట్ రేజ్ ఆఫీసర్ శ్రీని వాసరెడ్డి డిప్యూటీ పారెస్ట్ రేజ్ ఆఫీసర్ అనీల్‌కుమార్ యంపిపి పాలడుగు జోత్స్న యంపిడిఓ బి రామకృష్ణ నాయక్ తహశీల్థార్ యం సూర్యారావు అధికారులు పాల్గొన్నారు.










