ప్రజాశక్తి- అరకులోయ రూరల్ : అల్లూరి జిల్లా ఎస్‌సి సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, కాఫీీ మ్యూజియం, బస్ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్‌లో అరకు సిఐ జిడి.బాబు ఆధ్వర్యాన పోలీసుల ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పర్యాటక కేంద్రాలకు వచ్చే సందర్శకులు ఇక్కడ అందాలను ఆస్వాదించి, తగు జాగ్రత్తలతో తిరిగి వెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా అరకు సిఐ బాబు మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సమాచారం, సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఈ హెల్ప్‌డెస్క్‌ను పోలీస్‌శాఖ ద్వారా ఏర్పాటు చేస్తాన్నామని, పర్యాటకుల కావాల్సిన వివరాలను ఈ హెల్ప్‌డెస్క్‌లో తెలుసుకోవచ్చన్నారు. ఈ డెస్క్‌లో పోలీసు సిబ్బందితోపాటు ఒక గైడ్ ఉంటారని, టూరిస్ట్ ప్రాంతాల సమాచారం తెలియజేస్తారన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, మహిళ పోలీసులు పాల్గొన్నారు.










