Oct 30,2023 23:16
ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలిస్తున్న ఆర్‌ఎం సుధాకర్‌

ప్రజాశక్తి-పొదిలి: ప్రకాశం జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులో తీసుకువస్తామని రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌ అన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌, డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల దగ్గరకు స్వయంగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దైవదర్శనాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆర్టీసీలో మార్పులు చోటు చేసుకుంటాయని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్గో వ్యవస్థ కూడా మెరుగుపరుస్తామన్నారు. పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్‌, సిబ్బంది పనితీరు బాగుందని మేనేజర్‌ సుందరరావును అభినందించారు.