ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్ షెల్టర్, చలివేంద్రం ఏర్పాటు
ప్రజాశక్తి-డోన్
ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్ షెల్టర్, చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు. శుక్రవారం డోన్ పట్టణంలోని ప్రయాణికుల సౌకర్యార్థం బేతంచెర్ల రోడ్డు నందు తాత్కాలిక బస్ షెల్టర్ మరియు ప్రయాణికుల దాహార్తి తీర్చుటకు చలివేంద్రన్ని మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్,చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శశిభూషణ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,నంద్యాల జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్,వైస్ చైర్మన్ ఎస్.ఎం.డి.జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్లు బుర్రు రమాదేవి,మహేశ్వరరెడ్డి,వైసిపి నాయకులు శ్రీధర్ నాయుడు,జహీర్ పాల్గొన్నారు.










