ప్రజాశక్తి - చింతలపూడి
సకాలంలో స్పందించి ప్రయాణీకులను ప్రమాదం నుంచి తప్పించిన టిడిపి నియోజకవర్గ నాయకులు సొంగా రోషన్ కుమార్.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి నుంచి ఏలూరు వెళ్లే ప్రయాణ మార్గంలో రామచంద్రపురం గ్రామ సమీపాన 11 కేవి విద్యుత్ వైర్ తెగి రోడ్ మీద పడింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న రోషన్ కారు దిగి, అప్రమత్తమై వెళ్తున్న వాహనాలను ఆపి, విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ తీగ తెగిన సంఘటన అంతా వివరించారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి తక్షణ మరమ్మత్తులు చేశారు. దగ్గరుండి విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రమాదం నుంచి కాపాడిన చింతలపూడి నియోజకవర్గ టిడిపి నాయకులు సొంగా రోషన్‌కుమార్‌ని ప్రయాణీకులు, విద్యుత్ అధికారులు అభినందించారు.










