Dec 28,2022 20:30

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
పర్వతరెడ్డికి సన్మానం
నెల్లూరు:నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) వారు ఎపి పరిధిలో నాటా సేవా డేస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించిన నిడుగుంట పాలెం గ్రామ వాసి ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి అమెరికాలో 50 కు పైగా హాస్పిటల్స్‌ ను నిర్వహిస్తూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి గా అమెరికాలో గుర్తింపు పొందారు.ఇప్పటికే ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి తన సొంత గ్రామమైన నిడుగుంట పాలెంతోపాటు ఎపిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు
. ఈ సందర్భంగా నెల్లూరు విపిఆర్‌ ఫంక్షన్‌ హాల్లో ప్రేమ్‌ సాగర్‌ రెడ్డికి విశ్వ వైద్య విభూషణ్‌ అవార్డును ప్రదానం చేశారు.ఇందులో భాగంగా నెల్లూరు రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌, కష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ని ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు సత్కరించారు.