
పరవళ్లు తొక్కుతున్న కుందూ నది
చాపాడు : ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలకు కుండూ నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కొన్ని నెలలుగా సాధారణంగా ప్రవహిస్తున్న నీరు ఆదివారం రాత్రి నుంచి నదిలో నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం పది వేల క్యూసెక్కులకు పైగా పారుతోంది. కుందూ నదిలో నీరు ప్రవహిస్తుండడంతో అన్నవరం, చియ్యపాడు, ఖాదర్‌పల్లె, నాగులపల్లె, సీతారామపురం, అల్లాడుపల్లె, పెద్ద గురువలూరు, చిన్నగురువలురు గ్రామాల పరిధిలోని రైతులు వరి పంట సాగుకు సిద్ధపడుతున్నారు. ఈ నీటి ఆధారంగా ఎత్తిపోతల పథకాలు, ఫిల్టర్ల సాయంతో వరి పంట సాగు చేపడుతున్నారు. ఈ ఏడాది కుందూ నదికి నీరు అధికంగా చేరడం ఇదే మొదటి సారి.