Feb 14,2023 23:47

డిఆర్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - పరవాడ : పరవాడ మండల కేంద్రంలో ఇఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు బి.సింహాచలం, ఎస్‌.సీతారాం మంగళవారం డిఆర్‌ఓ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఎన్టిపిసి, ఫార్మాసిటీ, చిన్న పరిశ్రమల్లో 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరికి వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి వెంటనే ప్రారంభించాలని కోరారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో వచ్చిందని, ఈఎస్‌ఐ ఏర్పాటుకు జరిగిన అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన అధికారుల నుండి నాలుగు సంవత్సరాల నుండి అద్దెను రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెపి నేతలు ఈఎస్‌ఐ డైరెక్టర్లు ఇలాంటి అగ్రిమెంట్స్‌ ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు. విశాఖపట్నంలో 500 పడకల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రికి కుదించిన బిజెపి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్పాలన్నారు. వెంటనే పరవాడలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందిని, మందుల్ని ఏర్పాటు చేసి ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్వహణకు చర్యలు చేపట్టాలని కోరారు.