రాత్రి ఉండూరులో రైసు మిల్లులో తనిఖీలు
ప్రజాశక్తి - సామర్లకోట రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న జగనన్నకు చెబుదాం, భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్, రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న పిఎస్.. జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.ఇలాక్కియా వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం రాత్రి సామర్లకోట మండలంలో పర్యటించారు. ఉండూరు గ్రామంలో ఉన్న దేవి రైస్ మిల్లును తనిఖీ చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా తరలించిన ధాన్యం నిల్వల వివరాలు ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఆర్‌బికెలల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం, ట్రాన్స్ పోర్ట్, హమాలీల ఛార్జీలు, ఆర్‌బికె... రైస్ మిల్లుల అనుసంధానం, ఇప్పటి వరకు సేకరించిన మొత్తం ధాన్యం వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రద్యుమ్న వెంట జిల్లా వ్యవసాయ శాఖ జెడి ఎన్.విజరు కుమార్, పౌరసరఫరాల సంస్థ డీఎం డి.పుష్పమణి, ఎడిఎ జివి.పద్మశ్రీ, సామర్లకోట ధాన్యం కొనుగోలు ప్రత్యేక అధికారి పి.వసంత మాధవి, తహశీల్దార్ ఎస్.ఎల్.ఎన్.కుమారి ఇతర అధికారులు ఉన్నారు.
రాత్రి రైస్ మిల్లులో తనిఖీలు చేస్తున్న ప్రత్యేక అధికారి, జెసి బృందం










