Nov 20,2022 23:49

ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిఆర్‌ఒ

ప్రజాశక్తి- అనకాపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చేనెల 8వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ కోరారు. ఆదివారం స్థానిక జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలలో ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.. ఈ సంరద్భంగా మాట్లాడుతూ, 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. మండలాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ, అలాగే ఆన్‌లైన్‌లోనూ ఓటర్ల నమోదు, సవరణకు అవకాశం ఉందన్నారుకార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్‌ శ్రీరామ్మూర్తి, ఆర్‌ఐ రమేష్‌, ఎన్నికల సీనియర్‌ సహాయకులు, విఆర్‌ఒలు శేషగిరి, ఎవి గణపతి పాల్గొన్నారు.