
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆటల పోటీలు
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలోని ఎస్‌పిజి మైదానంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 6 నుండి 18 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు ఆటల పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ టీ షర్టులను, ఐదవ తరగతి నుండి పదవ తరగతి హియరింగ్ ఎంపైర్మెంట్, బ్లైండ్ విద్యార్థులకు ట్యాబ్‌లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఆటల పోటీలలో బోసి బాల్, ట్రై సైకిల్ రేస్, పరుగు పందెం, త్రోబాల్, అంధ విద్యార్థులకు, సెలబ్రెల్ పాలసీ పిల్లలకు స్లో వాకింగ్, త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ ప్రదానం చేశారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త కె.రఘురామిరెడ్డి హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఎక్స్ అఫీషియో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.