ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను చేపట్టందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి. రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ....చిత్తూరు జిల్లాలోని రైతులు ప్రధానంగా ఉద్యానవన పంటల సాగు తో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు మారాలని, ప్రభుత్వం లాభసాటి వ్యవసాయం కొరకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొనే దిశగా రైతులు కషి చేయాలని తెలిపారు. ప్రతి నెలా జరిగే వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వ్యవసాయరంగానికి అందిస్తున్న పథకాలు గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఖర్చులు తగ్గించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధి విధానాల గురించి జిల్లా వ్యవసాయ సలహా మండల్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుందనన్నారు. మామిడి పంట లో సేంద్రియ విధానంలో సాగు చేసేందుకు పలువురు సలహాలు కోరడం జరుగుతుందని, త్వరలో సదస్సులు నిర్వహణ కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కిసాన్ క్రెడిట్ గ్రూపుల ద్వారా డ్రోన్ పరికరాలను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని,మిల్లెట్స్ సాగు చేసే వారికి సబ్సిడీ కల్పించాలని ప్రధానంగా నీమ్, నీమ్ ఆయిల్ వంటి పదార్థాలు తప్పనిసరి అవుతున్నాయని బయట ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీలో చెల్లించే విధంగా చూడాలని సభ్యులు కోరారు. ఇందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ వివరిస్తూ ..ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ హైదరాబాదు వారు త్వరలో జిల్లా కు రానున్నారని వారి ద్వారా శిక్షణ తీసుకొని యంత్ర సామాగ్రిని ఉపయోగించుకుని నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసుకునేందుకు వీలు ఉంటుందని అన్నారు..వైయస్సార్ పశు నష్టపరిహారం కింద 7200 మంది రైతులకు 16 కోట్లు ఇవ్వడం జరిగిందని, రానున్న కాలంలో బీమా ఇవ్వడం జరుగుతుందని జిల్లా పశు సంవర్థక శాఖాధికారి ప్రభాకర్, పట్టుపురుగుల పెంపకానికి సంబంధించిన షెడ్ల నిర్మాణంలో డ్వామా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాల ద్వారా సబ్సిడీ అందజేయడం జరుగుతుందని పట్టు పరిశ్రమ శాఖ జీడి శోభారాణి సభ లో వివరించారు. యాంత్రికరణ చేపట్టడం ద్వారా వధా అరికట్టేందుకు, సేంద్రియ ఎరువులను తయారు చేసుకునేందుకు వివిధ యంత్రాలు ఉన్నాయని వాటిని పరిశీలించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సభ్యుడు గోవర్ధన్ బాబి అన్నారు. ఈ సమావేశంలో సూక్ష్మ పోషకాలు, మామిడి పంటకు సంబంధించి మరోసారి అవగాహన సదస్సులు, కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి, డ్రోన్ కెమెరాలకు ప్రత్యామ్నాయం గురించి, మిల్లెట్స్ గురించి అవగాహన కల్పించేందుకు, వివిధ రకాల యంత్రాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కోఈఈ శ్రీహరి, సభ్యులు రత్నారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










