బద్వేలు : జగనన్న స్మా ర్ట్ సిటీ కోసం అధికారు లు దళితుల భూములను తీసుకున్నారు. ఇంత వరకూ ఎలాంటి నష్ట పరి హారం, ప్రతా ్యమ్నాయం చూపకపోగా పనులు ప్రారం భిస్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై టైర్లు, కంచెలు వేసి బైఠాయించారు. తమకు ప్రత్యా మ్నాం చూపకుండా ఎలా పనులు మొదలు పెడ తారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదగొట్టే ప్రయ త్నం చేయగా దళితులు, మహిళలు వారిని వారించారు. ఆందోళన కారులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. వివరాలు... జగనన్న స్మార్ట్ సిటీ కోసం గోపవరంలోని సర్వేనంబర్ 1751 నుంచి 1761 వరకు జెడ్‌హెచ్‌డిసి కింద గతంలో ప్రభుత్వం 28 మంది లబ్ధిదా రులకు 68 ఎకరాలను ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం జగనన్న స్మార్ట్ సిటీ కోసం దళితుల నుంచి సేకరించారు. అందులో 35 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు సోమవారం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. విషయం తెలుసుకున్న మడకవారిపల్లె దళితులు నెల్లూరు జాతీయ రహదారి 67 పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కంప మొక్కలు, టైర్లు రోడ్డుకు అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. సుమారు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది. బద్వేల్ రూరల్ పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను చెరదగొట్టే ప్రయత్నం చేశారు. ఈనేప థ్యంలో మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రూరల్ సిఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా చెదరగొట్టి కొంత మందిని అరెస్టు చేశారు. వామపక్ష నాయకులు ఆందోళనకారులకు సంఘీభావంగా నిలిచి నిరసన తెలియజేశారు. అనంతరం సిఐ, ఎస్‌ఐ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే ఆర్‌డిఒకు విన్నవించుకోవాలని చెప్పడంతో వారు సద్దుమనిగారు.










