దుకాణంలో తనిఖీలు చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రత్తిపాడులోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. రికార్డులు సరిగా నిర్వహించని రెండు దుకాణాల నుంచి రూ.1.63 లక్షల విలువైన 14.15 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డీలర్లపై కేసు నమోదుకు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. మరో దుకాణాల్లో కనీస అనుమతి పత్రాలు లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు రూ.1.63 లక్షల విలువ కలిగిన 200 లీటర్ల పురుగు మందుల విక్రయాలను నిలిపేశారు. తనిఖీల్లో వ్యవసాయాధికారి వాసంతి, తహశీ ల్దార్ కె.నాగమల్లేశ్వరరావు, స్థానిక వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.










