Sep 01,2023 22:14

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ-2తోట శ్రీనివాసులు

ప్రతిరోజూ రికార్డులను పూరించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మధ్యాహ్న భోజన అన్ని రికార్డులను ప్రతిరోజు పూరించాలని మండలం విద్యాశాఖ అధికారి-2 తోట శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల దుంపవారిపల్లి పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో స్వచ్ఛత పక్వాడ- సత్య విద్యాలయ ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులకు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శుభ్రత పరిశుభ్రత, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.
అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన మోతాదులో పప్పు, నూనె ఇతర వస్తువులు వేయడంతో పప్పు రుచిగా ఉందని మధ్యాహ్న భోజన నిర్వాహకురాలను అభినందించి అందరూ మధ్యాహ్నం భోజన నిర్వాహకులు ఈ విధంగా రుచికరంగా తయారు చేయగలరని సూచించారు. ముఖ్యంగా పాఠశాల అన్ని రికార్డులను పరిశీలిస్తూ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, గుడ్డు, చిక్కీల రికార్డులను ప్రతిరోజు అప్‌డేట్‌ చేసుకుంటూ పూరించాలని ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.