దీపాల వరుసలతో
ఆనందాల వెలుగులతో
కనుల నిండుగ
సందు సందు కళ కళ లాడగ
ఆకాశమంతా
రంగులమయం చేసి
చిన్నా పెద్దనే తేడా మరిచి
అంబరాన్నంటిన
సరదాల సంబరాలతో
మునిగి తేలుతున్న
జనం ఒకవైపు,
కడుపులో ఖాళీ పేగులు
మెలితిరగగా
ఆకలి మెరుపులు
లోకమే చీకటిగా
కొందరు మరోవైపు
ఇదేనా దీపావళి?
ఇదేనా
చెడుపై మంచి విజయం?
ఓ మనిషీ!
అరిషడ్వర్గాలనూ దహనంచేసి
మంచి, మానవత్వం, స్నేహం
సాయం, చిరునవ్వనే కాంతులతో
జీవితాన్ని వర్ణశోభితం చేస్తే
మన జీవితాల్లో
ప్రతిరోజూ దీపావళే
అని గుర్తెరుగు.
వేమూరి శ్రీనివాస్
99121 28967