ప్రజాశక్తి-అమలాపురం
రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల గొంతునొక్కేలా ప్రభుత్వ వ్యవహరించడం దారుణమని పలుపార్టీలకు చెందిన నాయకులు ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహి ంచారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె. సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం మాజీ ఎంఎల్‌ఏ అయితాబత్తుల ఆనందరావు లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు, ప్రతిపక్ష పార్టీలపై సాగుతున్న నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు.రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ప్రజలపై భారాలు వేస్తూ మరోవైపు ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తిని అణిచివేసేందుకు నిర్భంధానికి పూనుకుంటోం దన్నారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజలు, కష్టజీవులు, కార్మికులు తమ నిరసన తెలియజేయడానీకి కూడా అవకాశం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదర్శనలకు, ధర్నాలకు అనుమతివ్వడం లేదన్నారు. హాలు మీటింగుకు కూడా అనుమతులు తీసుకోవాలని నిబంధనలు పెడుతోందని అన్నారు. ఈ దుర్మార్గమైన వైఖరిని నాయకులు ఖండించారు. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాసే కేంద్రంలోని బిజెపి బాటలో పయనిస్తున్న రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు జరగగకుండా భగం చేసిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని రౌండ్ టెబుల్ సమావేశం పాల్గొన్న సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు జి.దుర్గాప్రసాద్, పాము బాలయ్య, కె.నాగబాబు, యు.నాగరాజు, బి.బలరాం, పోతుల నాగరాజు, వేగిరాజు వెంకటరాజు, కెట రమేష్, మోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు.










