Jul 20,2023 19:36

ప్రజాశక్తి - చింతలపూడి
         ప్రతిఒక్కరూ జగనన్న సురక్షను వినియోగించుకోవాలని చింతలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమాట్ల ఎలిజా తెలిపారు. పరిపాలన వ్యవస్థను ప్రజలకు సంచివాలయం రూపంలో అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దని కొనియాడారు. రాఘవపురం, చింతలపూడి పట్టణం సుప్రింపేటలో జగనన్న సురక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలకు ఏదైనా అవసరం అయితే జిల్లా కార్యాలయాలు, మండల కార్యలయాలు వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు గ్రామంలో ఉన్న సంచివాలయంలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం సర్పంచి కోండ్రు వజ్రకిషోర్‌ పాల్గొన్నారు.