ప్రజాశక్తి - ముసునూరు
మేరా భారత్ - మేరా దేశం కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని రమణక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివిఎస్ రామకృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని రమణక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు మేరా భారత్ - మేరా దేశం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షకీల, వ్యాయామ ఉపాధ్యాయులు వాక నాగరాజు, విద్యార్థులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.










