Jul 21,2023 23:28

కరపత్రం ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

పల్నాడు జిల్లా: వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నియోజక వర్గంలో భూ సదస్సులు నిర్వ హించి ఆయా ప్రాంతంలో ఉన్న అసైన్మెంట్‌ భూముల జాబితా బయటకు తీసి ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి అర్హులైన పేదలకు పం పిణీ చేసేలా పోరాటాలు నిర్వహిస్తామని వ్యకాస పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేం ద్రంలో ఈనెల 27న పరిషత్‌ కార్యాలయం వద్ద వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సదస్సు జయ ప్రదం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా లక్ష్మేశ్వరరెడ్డి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఎకరాలకు అసైన్మెంట్‌ పట్టాలు ఇస్తానని ప్రకటించిందని 50 వేల ఎకరాలు అనేది తక్కువ విస్తీర్ణం అని కొద్దిపాటి మరమ్మతులు చేపడితే సాగుకు పనికి వచ్చే భూములు లక్షలాది ఎకరాలు ఉన్నా యన్నారు. భూ పంపిణీ అనేది ఒక విధానంగా చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు అసైన్మెంట్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా పట్టాలు ఇచ్చి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గం లో పేదలకు పంపిణీ చేయడానికి అవకాశం ఉన్న భూముల జాబితా బయటకు తీసి వివరాలను ప్రభుత్వం దష్టికి తీసుకురావడానికి పేదలకు చెందిన భూ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ కుమార్‌, మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ శివ కుమారి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి మల్లేశ్వరి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు హనుమంత్‌ రెడ్డి, ఎస్‌ ఆంజనేయ నాయక్‌, నాయకులు సిలార్‌ మసూద్‌ ,పిచ్చారావు బాలకష్ణ, హనుమంతరావు, ఆంజనేయులు, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.