Jun 18,2023 18:37

పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన దృశ్యం

ప్రతిభకు పురస్కారం

ప్రజాశక్తి - ఆదోని

2022-23 విద్యా సంవత్సరం పది ఫలితాల్లో ప్రతిభ కనబరచిన ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల వాల్మీకి విద్యార్థులకు శ్రీమహర్షి వాల్మీకి ప్రతిభా పురస్కారాలను డివిజన్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అందజేశారు. ఆదోని పట్టణంలోని వాగ్దేవి పాఠశాల వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఎంఈఓ శివ రాములు, హెచ్‌ఎం శ్రీనివాసులు, ఈఎస్‌ఐ డాక్టర్‌ కెఆర్‌ స్వామి చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి అంకిత భావం తో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇంతటితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన వాల్మీకి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నరసయ్య, రమేష్‌ నాయుడు, సీనియర్‌ జర్నలిస్టులు ఆంజనేయులు, వెంకన్న, ఉద్యోగులు పాల్గొన్నారు.