Aug 23,2023 16:16

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
    ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ 2022-2023లో స్థానిక ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కి చెందిన విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచారని ప్రిన్సిపల్‌ లక్ష్మి సరోజరెడ్డి తెలిపారు. బుధవారం ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ 2022-2023లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ లక్ష్మి సరోజారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన టి.శరణ్య డ్రాయింగ్‌ ఒలంపియాడ్‌లో స్టేట్‌ థర్డ్‌ సాధించి మెడల్‌, రూ.1,200, కె.ప్రతిభా సరోజ్‌ రెడ్డి, ఇంగ్లీషు ఒలంపియాడ్‌లో స్టేట్‌ ఫోర్త్‌ సాధించి మెడల్‌, రూ.1,000, ఇంగ్లీష్‌ ఒలంపియాడ్‌లో కె.ప్రజ్ఞత సరోజ్‌ రెడ్డి స్టేట్‌ ఫోర్త్‌ సాధించి మెడల్‌, రూ.700 నగదు, అవార్డును గెలుచుకున్నట్లు తెలిపారు.
గణితంలో ఎక్సలెన్స్‌ అవార్డులను దుర్గశ్రీ, డింపుల్‌ శ్రావణి, థీరజ్‌ గెలుచుకున్నారని తెలిపారు. డ్రాయింగ్‌లో హాషిమ్‌ హంసవర్థిని ఎక్సలెన్స్‌ అవార్డులను దక్కించుకున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతిభా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు నేషనల్‌ లెవెల్‌ గోల్డెన్‌ స్కూల్‌ అవార్డును ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ వారు బహూకరించారనీ తెలిపారు. అలాగే బెస్ట్‌ ప్రిన్సిపల్‌ అవార్డు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభలో నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, సింధుషారెడ్డి, ప్రిన్సిపల్‌ సరోజా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.