ప్రజాశక్తి - గాజువాక : చదువులో విశేష ప్రతిభ కనబరిచిన గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని విద్యార్థులకు ఎల్‌ఐసి ప్రతిభా ప్రోత్సాహకాలను అందజేసింది. లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న బీమా వారోత్సవాల్లో భాగంగా గాజువాక జెడ్‌పి హైస్కూల్‌లో ఆరోతరగతి నుంచి పదో తరగతి వదరకు మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గాజువాక యూనిట్ ఎల్‌ఐసి అధికారి పి.వేణుగోపాలరావు మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి అని, పాలసీ దారులకు సేవలందించడంలోనూ, క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్‌ఐసి ఎప్పుడూ ముందుంటుందన్నారు. హెచ్‌ఎం అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, తమ పాఠశాలల్లోని విద్యార్థులకు ఎల్‌ఐసి అవార్డులను అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి సహాయ శాఖాధికారి రాజశేఖర్, చీఫ్ అడ్వైజర్ సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.










