Mar 09,2023 01:10
మహిళలను సన్మానిస్తున్న వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-బాపట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో రాణిస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్న బాపట్ల నియోజకవర్గానికి చెందిన సంగీత కళాకారిణి చండ్రపాటి సూర్యప్రభ, నాదస్వర విద్వాంసు రాలు ఏ విజయలక్ష్మి, రచయిత్రి సి భవానిదేవి, యోగ మాస్టర్‌ మానం మల్లేశ్వరి, యోగ గురువు ధూళిపాళ్ల శైలజలను నరేంద్రవర్మ పార్టీ మహిళా నాయకులతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మానం విజేత, పార్టీ పార్లమెంటరీ నాయకురాలు పల్లం సరోజిని, మహిళానాయకులు పాల్గొన్నారు.