Aug 15,2023 20:26

ప్రజాశక్తి - ఉండి
విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని నింపి ప్రతిభను వెలికి తీసేందుకే విజయలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నగదు ప్రోత్సాహకాలను కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్నట్లు ఛైర్మన్‌ నల్లా సత్యకిరణ్‌ కృష్ణప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారం, మూడు 5వ తరగతి విద్యార్థులకు, ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు మొత్తం సుమారు రూ.80 వేలతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్‌పిటిసి రణస్థుల కనకదుర్గ మహంకాళి, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చిన విజయలక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లా వెంకట కుమారి, యలమర్తి శ్రీనివాసాచారి, గజపతిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆచంట: విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్పంచి సుంకర సీతారామ్‌ అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొడమంచిలి జెడ్‌పి హైస్కూల్లో మన ఊరి అసోసియేషన్‌ తరపున నెక్కంటి రవీంద్రనాద్‌ కుమార్‌ పదవ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు పెదపూడి సుప్రియకు రూ.2 వేలు, వర్ధనపు స్పందన రూ.1,500, చికిలే సౌజన్యకు రూ. వెయ్యి నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రం, మెడల్స్‌, మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో వైట్ల శ్రీను, గంటా శ్రీనివాసు, నెక్కల సాయి రవికుమార్‌ పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. తుందుర్రులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు గ్రామ సర్పంచి ఆరేటి వెంకట సత్య వీరస్వామి నాయుడు (పెద్దబ్బులు) స్కూల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్డు తాతాలు, ఆరేటి కాశి, ఆరేటి రాజు, రామకృష్ణ, కోయ నగేష్‌, దొరబాబు, వెంకట ప్రదీప్‌, స్కూల్‌ హెచ్‌ఎం కొల్లి సూర్యచంద్ర సాయిరాం పాల్గొన్నారు.
వీరవాసరం :స్వాతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ప్రతిభా విద్యార్థులకు సబ్బారపు వెంకట్రావు అండ్‌ కమల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రోత్సాహకాలు అందజేశారు. తొలుత స్కూల్‌ ఛైర్మన్‌ చుండూరి ముసలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మెమెంటోలు, డిక్సనరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జుత్తిగ శ్రీనివాసరావు, ట్రస్ట్‌ ఛైర్మన్‌ సబ్బారపు వెంకట్రావు, విద్యార్థులు పాల్గొన్నారు.