Nov 10,2023 21:07

తణుకురూరల్‌:బాల బాలికల్లో నిగూఢంగా ఉన్న ప్రతిభా, సామర్థ్యాల ప్రదర్శనకు బాలోత్సవాలు తోడ్పడాలని ప్రగతి కాలేజీ డైరెక్టర్‌ ఎంఎస్‌ఆర్‌ ఆంజనేయులు (ప్రగతి రాజా) అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బాలోత్సవం (పిల్లల సంబరాలు) సన్నాహక సమావేశం పి.దక్షిణామూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు (రాజా) మాట్లాడుతూ పిల్లల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనల పట్ల ఉంటే ఆసక్తిని ప్రోత్సహించడానికి, విద్య, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించడానికి ఈ బాలోత్సవాలు నిర్వహించాలనుకోవడం అభినందనీయమన్నారు. దీనికి పూనుకున్న శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్ర నిర్వాహకులకు పట్టణంలోని అన్ని పాఠశాలలూ సహకరించాలన్నారు. శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు పి.దక్షిణామూర్తి, పిఎల్‌ నరసింహారావు మాట్లాడారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యా సంస్థలు, ప్రజా సంఘాల సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు బాలోత్సవాల నిర్వహణకు మద్దతు తెలిపారు. అనంతరం బాలోత్సవాల లోగోను ఆవిష్కరించారు.