Aug 31,2023 21:51

ప్రతి విద్యార్థికీ క్రమశిక్షణ

రాయచోటి : ప్రతి విద్యార్థికీ క్రమశిక్షణ ముఖ్యమని జెఎన్‌టియు కళాశాల మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి. నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి శ్రీ సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఇండక్షన్‌(ప్రేరణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయనతోపాటు విశిష్ట అతిథిగా డైట్‌ కళాశాల అధ్యాపకులు జనార్దన్‌ రాజు హాజ రయ్యారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ ,అంకితభావంతో తరగతి గదిలోని పాఠాలను ప్రయోగశాలలో నిర్ధారించుకుని తరగతి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో అభ్యసించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని టెక్నాలజీని ఎప్పటికప్పుడూ పునఃశ్చరణ చేసుకొని సాంకేతికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించారు . నిజజీవితంలో దగ్గరగా చూసే టెక్నికల్‌ అంశాలను ఇండక్షన్‌ కార్యక్రమం ద్వారా సారూప్యత గమనించవచ్చని అభిప్రాయపడ్డారు. జనార్దన్‌ రాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పై అవగాహన పెంపొందించుకొని, బంద చర్చలలో పాల్గొని సాఫ్ట్‌ స్కిల్స్‌ను వద్ధి చేసుకోవాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సాయి విద్యాసంస్థల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ఎం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కోర్సులో మొదటి సంవత్సరం నుండే ప్రతి విద్యార్థి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచి, టెక్నికల్‌ ప్రదర్శనలో పాల్గొని వివిధ ఆవిష్కరణలను విశ్లేషించి తదుపరి నవీకరణకు శోధన చేయాలని సూచించారు. సాయి ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, ప్రభుత్వ , ప్రయివేట్‌ అఖిల భారత సర్వీసులలో అత్యున్నత హోదాలో స్థిరపడ్డారని చెప్పారు. యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి గోల్డ్‌ మెడల్స్‌, ప్రతిభ అవార్డులు సాధించారని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులకు పారిశ్రామిక అవసరాలను తీర్చే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టి ప్రయోగశాలలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిందని చెప్పారు. దీనికి అనుగుణంగా మొదటి సంవత్సరం నుంచి కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ విభాగాలు యందు ప్రత్యేక శిక్షణ వనరులు కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రతి సంవత్సరమూ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి. బాలాజీ ,వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న నారాయణరెడ్డి