ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : ప్రతి విద్యార్థి మొక్కలను నాటి వాటిని పోషించాలని గ్రీన్ భారత్ ఫౌండర్ రెడ్డి వారి శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం పుట్టపర్తి మండల పరిధిలోని బీడుపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే మొక్కలను నాటించారు. ఇలా పాఠశాలలోనూ నివాసాల ముందు, పెరట్లో చెట్లు పెంచి కాపాడితే భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత ఉండదని అన్నారు. ప్రతి గ్రామంలోనూ కొంతమంది పచ్చదనం పోషించే వారిని గుర్తించి విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని తెలిపారు. గ్రీన్ భారత ఆధ్వర్యంలో చెట్ల పెంపకం ఉద్యమంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భారత్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంకట రత్నం, బీడుపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










