May 14,2023 17:15

తల్లులను సన్మానిస్తున్న హోసన్నా వృద్ధాశ్రమ నిర్వాహకులు జాన.ప్రభాకర్

ప్రతి తల్లిని పిల్లలు బాధ్యతగా గౌరవించాలి
ప్రజాశక్తి-డోన్

      ప్రతి తల్లిని పిల్లలు బాధ్యతగా గౌరవించాలని హోసన్నా వృద్ధాశ్రమ నిర్వాహకులు జాన.ప్రభాకర్ పేర్కొన్నారు.ఆదివారం పట్టణంలోని వైఎస్ నగర్ లో ఉండే హోసన్న వృద్ధాశ్రమంలో మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి ప్రతి తల్లికి కేక్ తినిపించి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా హోసన్నా వృద్ధాశ్రమ నిర్వాహకులు జాన.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి తల్లి పిల్లలను బాధ్యతగా పెంచుతుందన్నారు.వృద్ధాప్యంలో తల్లిని పిల్లలు సరిగ్గా చూసుకోలేక వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారని అన్నారు.అనంతరం  వృద్ధాశ్రమంలో ఉండే తల్లులకు శాలువల తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ సూపర్వైజర్ భారతి,వృద్ధులు పాల్గొన్నారు.