మంగళగిరి: వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, పరిశీలకులు నిమ్మ కాయల రాజనారాయణలు ప్రారం భిం చారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమా వేశంలో అయోధ్యరామిరెడ్డి మాట్లా డుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నేటి నుండి ఇంటింటికి వివరించనున్నట్లు చెప్పారు. అనంతరం 16వ సచివాలయం పరిధిలో పావురాలు కాలనీలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, ప్రస్తుత ప్రభుత్వంపై సుముఖంగా ఉన్నారా లేదా అని, భవిష్యత్తులో జగనన్న పాలనను కావాలను కుంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి ఇళ్ళకు 'మా నమ్మకం నువ్వే జగన్' స్టిక్కర్‌ను ఇంటింటికి అంటించారు. 82960829 60 నెంబర్ కు లబి ్ధదారుల ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరిం చారు.
తాడికొండ: మండలంలోని ఫణిదంలో జగనన్నే మా భవి ష్యత్తు కార్యక్రమం ప్రారంభిం చారు. నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు సంక్షేమం అందిందని తెలిపారు. 'జగనన్నే మా భవిష్యత్తు 'కార్య క్రమం ఈ నెల 7 నుండి 20వ తేదీ వరకు జరుగుతుందని వివరించారు. ఒక కోటి 60 లక్షల కుటుంబాలను ఐదు కోట్ల మం ది ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా కలుసు కోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీలు గుడి మెట్ల జ్యోతి కందుల సిద్దయ్య వైస్ ఎంపీపీ రెడ్డి త్రివేణి జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శులు కొప్పుల శేషగిరిరావు, బాకీ వెంకటస్వామి, మాజీ ఎంపిపి కొమ్మినేని రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరు రూరల్: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం సందర్బంగా స్థానిక వైసిపి కార్యాలయంలో వైసిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆకుల వెంక టేశ్వర్లు మాట్లాడుతూ 2014 ఎన్నికల అనంతరం మున్సిపల్ కార్మికులను 40 మందిని తీసేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కే దక్కుతుం దని విమర్శించారు. తెలుగుదేశం నాయకులు అవి నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని అన్నారు. సమావేశంలో ఎం. అనిలాకుమారి, జి. గంగాధర్,మహమ్మద్ మాము, నయీమ్ బాషా పాల్గొన్నారు.










