Oct 14,2023 20:32

కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా

 కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఉన్నత పదవులు అందుతాయని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రవీంద్ర నగర్‌ లోని యూఎస్‌ మహల్‌ ఫంక్షన్‌ హాల్‌ లో జిల్లా వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్‌ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాల వారికి, కష్టపడి పని చేసిన వారికి ఉన్నత పదవులు అందించి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలలో ఈ విధంగా అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయలేదని తెలిపారు. జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మదీనా దస్తగిరి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటీ నుంచి ఎంతో కష్టపడి, ఇబ్బందులను, సమస్యలను అధికమించి న్యాయం చేస్తూ పని చేశారని అభినందిస్తూ జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ గా పదవి రావడం ఎంతో సంతోషించ దగ్గ విషయమన్నారు. ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసి ఉన్నత పదవులను అందుకోవాలన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగనన్నతోనే తన రాజకీయ ప్రయాణంలో పెట్టుకుని అప్పటి పని చేసిన మదీనా దస్తగిరి అని అన్నారు. మైదుకూరు శాసనసభ్యులు ఎస్‌ రఘురామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మదీనా దస్తగిరి ఎంతో కష్టపడి పని చేశారని ఆయనకు ఈరోజు న్యాయం జరిగిందని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తొలుత షేక్‌ మదీనా దస్తగిరి, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ తోపాటు జిల్లా వక్ఫ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ సయ్యద్‌ అలీ అక్బర్‌ (రిజ్వాన్‌),జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యులు పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌, రూపనగుడి అబ్దుల్‌ సుభాన్‌, షేక్‌ గౌస్‌ పీర్‌, పఠాన్‌ ఖాదిరుల్ల, చింతపల్లి షశావల్లి, ఇస్మాయిల్‌ సాబ్‌ గారి అన్వర్‌ సాబ్‌, షేక్‌ మహబూబ్‌ బాషా, షేక్‌ మహమ్మద్‌ ఉమర్‌, షేక్‌ కరిముల్లా లు జిల్లా వక్ఫ్‌ బోర్డు కార్యవర్గం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెద్ద ఎత్తున వారికి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ సురేష్‌ బాబు, రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి, నాయకులు, నాయకురాళ్ళు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు.